Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం పై అవగాహన

మునగాల మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం నాలుగో సెంటర్లో శుక్రవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ సంధ్యారాణి మాట్లాడుతూ..

పోషణ పక్షం పథకం ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వాళ్ల ఆరోగ్యం పై శ్రద్ధ ఎలా వహించాలి, పోషకాలతో నిండిన ఆహార నియమావళిని ఎలా రూపొందించుకోవాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలన్నింటినీ కలిపి ఈ పోషణ పక్షం పథకాన్ని ప్రభుత్వం రూపొందించిందని అన్నారు.గర్భవతిగా నిర్దారణ అయినప్పటి నుంచి బిడ్డపుట్టి రెండు సంవత్సరాలు నిండే వరకు వేయి రోజుల పాటు పిల్లలకు మంచి పౌష్టికాహారం, సంరక్షణ పట్ల గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ కె అనిత, ఆయా ఎస్.కె రేష్మ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

TNR NEWS

డిసెంబర్ 2న సిపిఎం బహిరంగ సభ జయప్రదం చేయాలని కరపత్రం విడుదల నన్నూరి వెంకటరమణారెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి  కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక  శివుని అనుగ్రహంతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

TNR NEWS

అకాల వర్షాల దృష్ట్యా రానున్న 3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

TNR NEWS