శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం సోమవారం కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పట్టణ మాజీ సర్పంచ్ ఎర్నెని కుసుమ వెంకటరత్నం బాబు నివాసంలో అత్యంత వైభవోపెతంగా నిర్వహించారు. వేకువ జాము నుంచే స్వామివారికి అభిషేకాలు జరిపి తీరొక్క పూలతో విశేష అలంకరణ, సహస్రనామాలు, అర్చనలు, కైంకర్యాలు, చక్ర స్నానం, గోపూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేద పండితులు పెద్దింటి అరుణ్ కుమార్ ఆచార్యులు శిష్య బృందం చే పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల మధ్య కనుల పండువగ నిర్వహించారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని, శ్రీ లక్ష్మీ నరసింహ సహిత సుదర్శన హోమాన్ని కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎర్నెని వెంకటరత్నం బాబు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్నెని కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు………….

previous post