Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఉపాధి హామీ పథకంలో రేషన్ డీలర్లకు పని కల్పించాలి

జాతీయ ఉపాధి హామీ పథకంలో రేషన్ డీలర్లకు పని కల్పించాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు, మండల రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్ష ,కార్యదర్శులు కేశగాని రమ ఆంజనేయులు, మిట్టగనపుల సైదులు 

ఆఫీసర్లను కోరారు.గురువారం మునగాలలో వారు విలేకరులతో మాట్లాడుతూ రేషన్ డీలర్లు కమిషన్ ప్రాతిపదికన మాత్రమే పనిచేస్తున్నారని చిన్న చిన్న గ్రామాల్లో నెలవారీగా వారికి కనీసం ఐదు నుంచి 6000 కూడా కమిషన్ రాని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. తాము కాంటాక్ట్ బేసిక్ లోను ప్రభుత్వ జీతంతోనో జీవనం గడపడం లేదని కమిషన్ బేసిక్ తో వచ్చే కమిషన్ తో కుటుంబాలు గడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. కొన్ని మండలాల్లో ఉపాధి హామీ పనులు ఆఫీసర్లు అనుమతిస్తున్న మునగాల మండలంలో పనులు కల్పించకపోవడం శోచనీయమన్నారు ఈ సందర్భంగా సంబంధిత సూర్యాపేట జిల్లా శరవాణి ద్వారా డి ఆర్ డి ఓ కు పని కల్పించాలని కోరగా వెంటనే డీలర్లకు వారి కుటుంబ సభ్యులకు పని కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ విషయమై సంబంధిత ఎంపీడీవోలకు కూడా పని కల్పించాలని చెప్తామని చెప్పారని వారు చెప్పారు రేషన్ డీలర్ల మరియు వారి కుటుంబ సభ్యులకు ఉపాధి హామీ పని కల్పించాలని కోరారు

Related posts

రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం

Harish Hs

ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలి ఎస్సై గణేష్

TNR NEWS

కోదాడలో ఘనంగా నాభి శిలా బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం

TNR NEWS

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థులకు బ్రెడ్,పండ్లు పంపిణీ

Harish Hs

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS

దుకాణ సముదాయాలు, గోదాములను ప్రారంభించిన మంత్రి

TNR NEWS