Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వర్షం నీరు రోడ్డుపై నిల్వకుండ మొరం వేయాలి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

వర్షం నీరు రోడ్డుపై నిల్వకుండ రోడ్డుపై మొరం వేయాలని సంబంధిత అధికారులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్ళ వద్ద రోడ్డుపై నిల్వ ఉన్న వర్షపు నీటిని తక్షణమే తొలగించాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండ చూడాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. వారి వెంట మండల కన్వీనర్ కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ముండే పాండురంగ్, మాజీ ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సాబీర్, రమేష్, మహేందర్ రెడ్డి, గణేష్ తదితరులు ఉన్నారు.

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈనెల 27వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్కులో జరగనున్న ఆటో ఆకలి కేకల మహాసభకు అండగా నిలవాలని కోరుతూ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను కలిసి పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రూ. 5000 విరాళంగా అందజేశారు. ఆటో డ్రైవర్ల కష్టాలను దృష్టిలో పెట్టుకొని వారి న్యాయం జరిగేంత వరకు పార్టీ తరపున పోరాడుతామని భరోసా కల్పించారు.

తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25 వసంతాల సంబురం రాజతోత్సవాల పోస్టర్ విడుదల

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదంతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఈనెల హైదరాబాద్ లోని జల విహార్ లో నిర్వహిస్తున్న 25 వసంతాల రాజతోత్సవాల సంబురాల పోస్టర్ ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ విడుదల చేశారు.

Related posts

మాస్టిన్ కుల హక్కుల కోసం పోరాటం

Harish Hs

పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

TNR NEWS

అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలి…. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో, అంబేద్కర్ వర్ధంతి

TNR NEWS

తుర్కపల్లి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక. అర్హులకు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తారు..  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. హరి నారయణ గౌడ్

TNR NEWS

కోదాడ పట్టణంలో 40 మంది మెప్మా ఆర్పీల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS

చలో హైదరాబాద్ కు తరలుతున్న ఆటో డ్రైవర్ల ముందస్తు అరెస్టు

TNR NEWS