Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతులెవరు ఆందోళన చెందవద్దు యధావిధిగా యూరియా అమ్మకాలు

సూర్యాపేట జిల్లాలో వానకాలం రైతులు సాగు చేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని డీలర్లు యధావిధిగా యూరియా అమ్మకాలు జరుపుతారని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఫెర్టిలైజర్ అసోసియేషన్ నాయకులు, వ్యవసాయ అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఫెర్టిలైజర్ షాపు యజమానులు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని నేటి నుండి యధావిధిగా యూరియా అమ్మకాలు జరుగుతాయన్నారు. రైతులు ఇప్పుడే వరి సాగు, విత్తనాలు వేస్తున్నారని యూరియా వేసే సమయం రాలేదని ముందస్తుగా యూరియాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ సీజన్లో రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు రైతులకు సకాలంలో అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదేవిధంగా యూరియా అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు రైతులు ఆందోళన చెందెందుకు కారకులైన వారిపై,యూరియాను బ్లాక్ చేసిన అధిక ధరలకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఫెర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఒక్క యూరియా బస్తా అమ్మితే 30 రూపాయలు లాస్ వస్తున్నందున తాము యూరియా సరఫరా చేసే కంపెనీల పై ఒత్తిడి తెచ్చేందుకే తమ అసోసియేషన్ నాయకులు అంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశామని రైతులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన తమకు లేదన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామన్నారు. నేటి నుంచి యధావిధిగా యూరియా అమ్మకాలు కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏవోలు రజని, రాజు, ఫెర్టిలైజర్ డీలర్స్ ఉపాధ్యక్షులు జూలకంటి రామిరెడ్డి, డీలర్ రామారావు తదితరులు పాల్గొన్నారు……..

Related posts

తెలంగాణ – టర్కీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు  టర్కీ రాయబారి ఫిరాట్‌ సునెల్‌తో మంత్రి దామోదర్‌ భేటీ

TNR NEWS

లారీ అసోసియేషన్ అభివృద్ధిలో ముండ్ర వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయం

TNR NEWS

పట్టణ భూమిలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు, సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Harish Hs

రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాలరాయడమే

Harish Hs

షీ టీమ్స్,సైబర్ నేరాలపై అవగాహన

TNR NEWS