Tnrnews.in
తెలంగాణ

రైతులెవరు ఆందోళన చెందవద్దు యధావిధిగా యూరియా అమ్మకాలు

సూర్యాపేట జిల్లాలో వానకాలం రైతులు సాగు చేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని డీలర్లు యధావిధిగా యూరియా అమ్మకాలు జరుపుతారని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఫెర్టిలైజర్ అసోసియేషన్ నాయకులు, వ్యవసాయ అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఫెర్టిలైజర్ షాపు యజమానులు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని నేటి నుండి యధావిధిగా యూరియా అమ్మకాలు జరుగుతాయన్నారు. రైతులు ఇప్పుడే వరి సాగు, విత్తనాలు వేస్తున్నారని యూరియా వేసే సమయం రాలేదని ముందస్తుగా యూరియాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ సీజన్లో రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు రైతులకు సకాలంలో అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదేవిధంగా యూరియా అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు రైతులు ఆందోళన చెందెందుకు కారకులైన వారిపై,యూరియాను బ్లాక్ చేసిన అధిక ధరలకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఫెర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఒక్క యూరియా బస్తా అమ్మితే 30 రూపాయలు లాస్ వస్తున్నందున తాము యూరియా సరఫరా చేసే కంపెనీల పై ఒత్తిడి తెచ్చేందుకే తమ అసోసియేషన్ నాయకులు అంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశామని రైతులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన తమకు లేదన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామన్నారు. నేటి నుంచి యధావిధిగా యూరియా అమ్మకాలు కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏవోలు రజని, రాజు, ఫెర్టిలైజర్ డీలర్స్ ఉపాధ్యక్షులు జూలకంటి రామిరెడ్డి, డీలర్ రామారావు తదితరులు పాల్గొన్నారు……..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గడ్డి వాము దగ్ధం

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS

ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో

TNR NEWS

రణపంగ శ్రవణ్ పూలేకు గౌరవ డాక్టరేట్* *నేటి సామాన్యుడికి దక్కిన అరుదైన గౌరవం* *ప్రజా సమస్య పైన వివిధ సామాజిక కార్యక్రమాలకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం.*  *లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం* *ఈ గౌరవం నా ఒక్కడిది కాదు… నన్ను నమ్మిన ప్రతి ఒక్కరి విజయం*  *ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది రణపంగ శ్రవణ్ పూలే

TNR NEWS

ఐకెపి కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లపై చర్యలు తప్పవు  వారం రోజుల్లో జిల్లాలోని దాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లులలో ఉన్న ధాన్యం అంతటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

TNR NEWS