ఎస్సీ వర్గీకరణ కొరకు ఎంతోమంది మాదిగలు అమరులయ్యారని వారి త్యాగాల ఫలితంగానే నేడు వర్గీకరణ సాధ్యమైనదని టి ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు తెలిపారు. సోమవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జెండాను ఆవిష్కరించి అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరిపారు. ఎమ్మార్పీఎస్ జెండాతో ఎన్నో హక్కులను సాధించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ వార్డ్ మెంబర్ గంధం రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలకొండ ఆదినారాయణ, బాల్గూరి హుస్సేన్, నెమ్మాది దేవమని, కర్ల కమాన్, కుడుముల సైదులు, చిరుమల వెంకటేష్, అడ్వకేట్ రవి బుడగ జంగాల అధ్యక్షులు కాశి ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు……..