భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న దత్తత పొందిన ఘట్టాన్ని గుర్తుచేసుకుంటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని *కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘo జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.* ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రం లోని సాంఘిక సంక్షేమ హాస్టల్ లో భారత రాజ్యాంగ దినోత్సవo జరుపుకుని రాజ్యాంగ ప్రవేశిక (పీఠక) చదివి ప్రమాణం చేయడం జరిగింది. ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ
1949 నవంబర్ 26 వ రోజున రాజ్యాంగ అసెంబ్లీ రాజ్యాంగాన్ని ఆమోదించింది, అయితే అది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని తెలిపారు.
దేశ ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 15), గణతంత్ర దినోత్సవం (జనవరి 26)ను పెద్ద ఎత్తున జరుపుకుంటారని
కానీ రాజ్యాంగ దినోత్సవం కొత్తదిగా ఉండటంతో అది పెద్దగా ప్రజాదరణ పొందలేదని తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం ప్రారంభం 2015 నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఆశయాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ దినోత్సవలో పాల్గొని రాజ్యాంగ దినోత్సవం సభ ల లో పాల్గొనాలని ఈ సందర్భంగా స్కూళ్లు,కాలేజీలు,విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహి చాలని తెలిపారు.
విద్యార్థులకు రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగాలు,చర్చలు,మాక్ పార్లమెంట్ కార్యక్రమాలు నిర్వహించి ఈ దినోత్సవం ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెంచడంలో ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. అంబేద్కర్ తన విద్యాభ్యాసం కోసం ఎన్నో ఆటంకాలను అధిగమించారని తెలిపారు. విదేశాలకు వెళ్లి అగ్రశ్రేణి గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి గణనీయమైన జ్ఞానాన్ని పొందారని అన్నారు. ఈ వేడుకలు భారతీయుల గర్వకారణంగా నిలుస్తున్నాయని తెలిపారు. Kvps జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్,మరియు
జె ప్రవీణ్ cb చరణ్ సిద్దర్ద ప్రవీణ్ మహేష్ అభిషేక్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.