: ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో
ఆషాడ మాసం బోనాల పండుగ సంబురాలు పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు బోనం ఎత్తుకొని పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి విద్యార్థినులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబెంచేలా బోనాలను అలంకరించి డప్పు చప్పుళ్లతో, నాట్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి గ్రామదేవతలకు బోనం సమర్పించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో జానపద గేయాలకు విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం నృత్యాలు చేసి బోనాల పండుగ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ప్రధానోపాధ్యాయురాలు మంజుల. ఉపాధ్యాయులు భాను. అపర్ణ. విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.