విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు గుర్తిపు తీసుకోని రావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు.గురువారం
కోదాడలో మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము ఎంపీసీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సామర్థ్యాలను పరిశీలించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా,ఎలా చదువుతున్నారు కళాశాలలో భోజనం సరిగా ఉంటుందా పాఠాలు అర్థమవుతున్నాయా, ఏమైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని.వారిలో విద్య పట్ల ప్రేరణ,ఆసక్తి కలిగేలా ఉద్బోధించారు.పాఠశాల హాస్టల్ నిర్వహణను పరిశీలించారు.స్టోర్ రూమ్ నందు బియ్యం, కూరగాయలను పరిశీలించి మెను ప్రకారం వండిన అన్నం,కూరలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి విద్యార్థులతో గ్రూప్ ఫోటో దిగారు.