నడిగూడెం పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న కానిస్టేబుల్ వి.ఉపేందర్, పాలకివీడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బి.వెంకటేశ్వర్లు, మునగాల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జి.శ్రీకాంత్ లు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొందారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఎస్పి ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నర్సింహా ప్రమోషన్ పొందిన ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ లకు ప్రమోషన్ ఉత్తర్వులు అందజేసి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగోన్నతి తో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని బాధ్యతలు కు అనుగుణంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని, పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. క్రమశిక్షణతో మెలగాలని, తోటి సిబ్బందిని గౌరవించాలని సమన్వయంతో ముందుకెళ్లాలని కోరినారు. ఆరోగ్యం పట్ల, కుటుంబాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఎస్పీ వెంట అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, ఏఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, ఏఆర్ డియస్పి నరసింహ చారి, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

previous post
next post