తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గణిత ప్రతిభ పోటీ పరీక్షలను కోదాడ పట్టణంలోని బాలుర హై స్కూల్ నందు గణిత ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మండల ఉపేందర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లోని 60 మంది విద్యార్థులు ఈ పోటీ పరీక్షల్లో పాల్గొన్నారు.పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గణిత ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు,మండల విద్యాధికారులు మెమొంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. జిల్లాస్థాయి పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు డిసెంబర్ 22న హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, మండలవిద్యాధికారులు సలీం షరీఫ్,శ్రీనివాసరావు, గురవయ్య, వెంకటేశ్వర్లు,ఉపేందర్, ప్రసాద్, ధనమూర్తిఅన్ని మండలాల బాధ్యులు పాల్గొన్నారు…
విజేతలుగా నిలిచిన విద్యార్థులు……
ఇంగ్లీష్ మీడియం విభాగంలో సురేష్, మౌనిక,తెలుగు మీడియం పల్లవి, సమీరా, రెసిడెన్షియల్ విభాగం వరుణ్ తేజ, రోహిణి లు ఆరుగురు రాష్ట్ర స్థాయిలో పాల్గొననున్నారు…..