Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జైలు జీవితం అంటే – ఏంటో తెలియజేసి రాజీ కుదర్చడమే ఆయన లక్ష్యం    ఎన్.విజయ్ కుమార్ గద్వాల జిల్లా కోర్ట్ న్యాయవాది

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన అడ్వకేట్ ఎన్.విజయ్ కుమార్,గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు.సమాజంలో సాధారణ ప్రజలకు చట్టాలు అంటే ఏంటో తెలియని పరిస్థితులలో గోరుతోనే పోయే పరిష్కారాలు గొడ్డలితో మాత్రమే పరిష్కారం అవుతాయి అనే మూర్కపు ఆలోచనలతో,కుటుంబాల బంధాల విలువలు తెలుసుకోకుండా, ఆవేశంతో చిన్నచిన్న తగాదాలతో పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అవుతుండడం చూసి, అడ్వకేట్ విజయ్ కుమార్ స్వయంగా అభాగ్యుల దగ్గర చెంతకు చేరి తెలిసి తెలియని పొరపాట్లకు జైలు జీవితం అంటే ఏంటో,చట్టాలు అంటే ఏంటో క్షుణ్ణంగా కక్షిదారులకు వివరించి రాజీ కుదర్చడమే ఆయన లక్ష్యం. కక్షిదారులు ప్రేమతో సహకరిస్తే తప్ప ,ఏనాడు డబ్బులు తీసుకోడని,రాజీ పడిన ప్రజల నుండి ప్రశంసలు,అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 

అడ్వకేట్ విజయ్ కుమార్ విధుల పట్ల ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన చూసి న్యూస్ రిపోర్టర్ వివరణ అడుగగా, అడ్వకేట్ విజయ్ కుమార్ స్పందించి మాట్లాడుతూ…. గ్రామీణ ప్రాంతాలలో అమాయక ప్రజలు వారి ఆర్థిక పరిస్థితుల వల్ల సమాజంలో చదువుకి దూరమై, చదువు విలువ తెలుసుకోకుండా, చట్టాల పట్ల అవగాహన లేకపోవడంతో పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అవుతుండడం చూసి,వారు చేసిన తప్పులకు జైలు జీవితాలు గడుపుతుండడం చూసి తన దగ్గరికి వచ్చిన వారికి అన్ని అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ, ఒక్కోసారి తనే స్వయంగా బాధితుల దగ్గరికి వెళ్లి చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ, రాజి కుదర్చడంతో వారి కళ్ళల్లో ఆనందభాష్పాలు,సంతోషాలు చూడడమే నా లక్ష్యం అని అన్నారు. సమాజంలో ఏ పరిస్థితుల వల్ల వాళ్లు చదువుకు దూరమయ్యారో,వారి లాంటి పరిస్థితులు వారి పిల్లలకు రాకూడదని వారి పిల్లలను గొప్పగా చదివించండి అంటూ అవగాహన కల్పిస్తున్నానని మీడియాతో తెలియజేశారు.

Related posts

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

TNR NEWS

జోనల్ మీట్ లో రాణించిన చివ్వెంల విద్యార్థులు*

TNR NEWS

వరి పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

Harish Hs

పల్లె చుక్కయ్యను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి… 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత

TNR NEWS

నవజీవన్ ఎక్స్ ప్రెస్ తిరిగి పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లో నిలుపుదల చేయాలి.. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ సికింద్రాబాద్ వారికి వినతి.. –డి.ఆర్.యు.సి.సి రైల్వే కమిటీ మెంబర్ ఎన్డి .తివారి..

TNR NEWS

అనాధ ఆశ్రమంలోఅన్నదానం….  మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు..

TNR NEWS