కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల కొరకు అన్నదానం దాతలు వీడాల వీరభద్రరావు జ్ఞాపకార్థం సతీమణి సరస్వతి కుమార్తెలు, అల్లుళ్లు భారతీ, అంజలి, మాధవి, సంధ్యారాణి లతో పాటు ఇతర దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని దాతలు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకురి అంజయ్య,ఆలయ సెక్రటరీ కోట. తిరుపతయ్య, అన్నదాన నిర్వాహకులు దేవరశెట్టి. హనుమంతరావు ఆలయ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, సత్యం, బ్యాటరీ చారి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు…

previous post