ఓదెల మండల కేంద్రం నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కోట్లతో కొత్తగా నిర్మించిన రెండు వరుసల రోడ్డు ఓదెల నుండి కొలనూరు వెళ్లే దారిలో ఈదుకుంట వద్ద మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు డబుల్ రోడ్డు డ్యామేజ్ ఏర్పడి వాహనదారులకు ప్రజలకు ప్రమాదకరంగా మారింది. రోడ్డు వేసినప్పటినుండి సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు . వెంటనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు
