కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా మాజీ అధ్యక్షుడు,మాదిగ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు ఇటీవలి కాలంలో మృతి చెందగా, సూర్యాపేట జిల్లా మాదిగ జర్నలిస్టులు 50వేల రూపాయలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా రఘు భార్య పడిశాల మౌనికాకు 50వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎంజెఎఫ్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్ సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంద క్రిష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఏ బి సి డి వర్గీకరణ కోసం పోరాడిన పడిశాల రఘును ఎమ్మార్పీఎస్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని రఘు కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అండదండలు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. రఘు భార్య మౌనికను ఆదుకునేందుకు ప్రభుత్వంతో మాట్లాడతా అంటూ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో.. ఎం జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు బంక వెంకటరత్నం జిల్లా నాయకులు తోటపల్లి నాగరాజు, హుజూర్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ కోదాడ నియోజకవర్గ ఎం జె ఎఫ్ ఉపాధ్యక్షులు చీమ చంద్రశేఖర్, ఏపూరి సునీల్, బయ్యారపు రవీంద్ర, రాకేష్ ,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

previous post