మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా వివిధ ఇండ్లను పరిశీలించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి నేటికీ సంవత్సరకాలం అవుతున్న ఆ వాగ్దానం అమలు కాలేదని ఆ హామీని వెంటనే అమలు చేయాలని వారు అన్నారు.. రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా అనేకమంది పేదవాళ్లు నేటికీ పూరి గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నవారు చాలామంది ఉన్నారని వారికి తక్షణం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేయాలనివారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ గ్యారంటీలు అమలు చేస్తానని పేదవారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారన్నారు. కొన్ని సంవత్సరాలుగా గ్రామాలలో పేద బడుగు బలహీన వర్గాల వారు పూరి గుడిసెలలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని అట్లాంటి అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేయాలని పేదల కోసం పేద ప్రజల కోసం సిపిఎం పార్టీ అనునిత్యం పోరాటాలు చేస్తుందని పేదల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని వారు అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు రేఖ లింగయ్య శాఖ కార్యదర్శి నందిగామ సైదులు మాజీ సర్పంచ్ రావులపెంట వెంకన్న వైస్ సర్పంచ్ రావులపెంట బ్రహ్మం మిట్టగనుపుల సైదులు ములకలపల్లి సైదులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు