Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

మొక్కలను తోబుట్టువులుగా భావించి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ ఆవరణలో వృక్ష బంధన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిలోని చరాచర జీవులు సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. విజయీ భవ ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు చారుగాండ్ల ప్రవీణ రాజశేఖర్, ఓరుగంటి ప్రభాకర్, వెంపటి వెంకటరమణ, పత్తి నరేందర్, వెంపటి ప్రసాద్, గుడుగుంట్ల సాయి తదితరులు పాల్గొన్నారు………

Related posts

పుస్తెల తాడు చోరీ కేసులో నిందితులు పట్టివేత

TNR NEWS

స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ ను జయప్రదం చేయండి.     -ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్

TNR NEWS

కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి నిధులు మంజూరు చేయాలి 

Harish Hs

సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

TNR NEWS

సీనియర్ జర్నలిస్ట్ కి ఘన సన్మానం

TNR NEWS

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS