గత ఐదు సంవత్సరాల నుండి కులాంతర వివాహం చేసుకున్న వారికీ ఇచ్చే ప్రోత్సహకాలు పెండింగ్లోనే ఉన్నాయని బహుజన ఉద్యమకారుడు రాయరాల సుమన్ అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కులాంతర వివాహాలు చేసుకున్న లబ్ధిదారులు ప్రోత్సహకాల కోసం చూస్తున్నారని. కుటుంబాలని బంధులని ఎదిరించి వివాహాలు చేసుకున్న దంపతుల నిస్సహాయ స్థితిని కొందరు దుర్మార్గులు ఆసరాగా చేసుకుని,వారి ప్రాణాలు కి ముప్పు తెచ్చి లాభం పొందాలని ప్రయత్నిస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని.ఇటీవల సూర్యాపేట పట్టణంలో పిల్లలమర్రి కాలువ గట్టుపై జరిగిన పరువు హత్య లాంటి సంఘటనలు అత్యంత బాధాకరమని. ప్రభుత్వాలు కులాంతర వివాహ ప్రోత్సాహకాలు 3 నెలల లోపే అందిస్తే దంపతులకు,ఆ ప్రోత్సహక నిధులు చేయూత గా ఉండి, దూర ప్రాంతాలలో సైతం వారి జీవనం సాగించటానికి ఉపయోగ పడతాయని వారన్నారు, కావున తక్షణమే కఠినమైన చట్టాలను ఏర్పాటు చేసి పరువు హత్యలను ఆపాలని అన్నారు.తక్షణమే కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నిధులను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

previous post