కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన కొల్లూరు వెంకటేశ్వర్లు (41) ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆ క్రమంలో నిన్న శుక్రవారం రోజు హుజూర్నగర్ రోడ్డు లో ఉన్నటువంటి అమృత హాస్పిటల్ వద్ద ఒక వృద్ధ మహిళని ఆటోలో ఎక్కించుకొని ఆ తదుపరి ఆమెను బస్టాప్లో వదిలి వెళ్ళినాడు. ఆ మహిళ లక్ష రూపాయల నగదు గలిగిన బ్యాగును ఆటోలో మర్చిపోవడం జరిగింది. సదరు బ్యాగును గమనించిన కొల్లూరు వెంకటేశ్వర్లు నిజాయితీగా అట్టి బ్యాగును తిరిగి అ మహిళ దగ్గరికి వెళ్లి దాకుతో సహా నగదును తిరిగి ఇవ్వడం జరిగింది. స్వార్థంతో కూడిన సమాజంలో ఇటువంటివారు ఉండటం చాలా అరుదు. ఇలాంటి వ్యక్తికీ నిస్వార్ధంగా నిజాయితీగా తనకు దొరికిన లక్ష రూపాయల నగదును తిరిగి యజమానికి అప్పగించిన కొల్లూరు వెంకటేశ్వర్లు ని శుక్రవారం కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి వ్యక్తిగతంగా తన కార్యాలయానికి ఆహ్వానించి వారి కుటుంబ సభ్యులకు సమక్షంలో సన్మానించి అభినందించడం జరిగింది.
కోదాడ ప్రజలు సదరు వెంకటేశ్వర్లు ఆటో నెంబర్ TS 04 UC 8998 లో ప్రయాణం చేసి తనకు తగిన గుర్తింపును ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని డి ఎస్ పి శ్రీధర్ రెడ్డి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.