Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రతి రైతు నానో స్ప్రే వాడాలి

యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో స్ప్రే యూరియా వాడాలని స్ప్రే యూరియా వలన దిగుబడి ఎక్కువగా ఉంటదని సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి అన్నారు. గురువారం రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని తమ్మరలో నానో స్ప్రే యూరియా పై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి పాల్గొని మాట్లాడుతూ నానో యూరియా వాడడం వలన వాతావరణ, నీటి, నేల కాలుష్యం తగ్గుతుందని ఈ స్ప్రే ఆకుల మీద పడటం వలన వెంటనే దాని రిజల్ట్ తో పాటు పొలం వేపుగా ఎదిగిద్దని అన్నారు. యూరియా వేయడం వలన నేల కాలుష్యము అవుతుందని అలాగే యూరియా మొక్కకు మొక్కకు మధ్యలో పడటం వలన అది ఉపయోగం లేకుండా పోతుందని అన్నారు. ఈ స్ప్రే అన్ని వ్యవసాయ సహకార సంఘాలలో లభిస్తున్నాయని రైతులు ఈ స్ప్రేను వాడి వాతావరణ, నీటి, నేల కాలుష్యాన్ని నివారించడంలో భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం మగినం రాజు పొలంలో టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏవో రజని, పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస రెడ్డి, ఏఈఓ నగేష్, మాజీ కౌన్సిలర్ సామినేని నరేష్, కనగాల శ్రీధర్, స్వామినేని వెంకటేశ్వర్లు, కనగాల కొండయ్య, మందరపు నాగేశ్వరరావు, కనగాల పుల్లయ్య, మాతంగి ప్రసాద్, బొల్లు రామకృష్ణ, గోపాల్, లోకేష్, సతీష్, నగేష్, తదితర రైతులు పాల్గొన్నారు.

Related posts

రణభేరి సభకు తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు

Harish Hs

బేటి బచావో- బేటి పడావో వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభం..

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ లను తక్షణమే విరమించుకోవాలి: ఎం సాయిబాబా

TNR NEWS

నేడు జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కోదాడ లో ఘనంగా అయ్యప్ప స్వామి జన్మ దిన వేడుకలు

TNR NEWS

అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి కొత్త రోడ్లు వేయాలి సిపిఎం 

TNR NEWS