Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కార్మికులకు అండగా సిఐటియు జెండా నిరంతరం పోరాటం చేస్తుంది

కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు కార్మికులు ఐక్య ఉద్యమాలు చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి కోటగిరి వెంకట్ నారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు 

 

శనివారం స్థానిక కోదాడ పట్టణం కూరగాయల మార్కెట్ హమాలివర్కర్స్ యూనియన్ మహాసభ ఏసోబు అధ్యక్షతన జరిగింది 

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి చనిపోయిన కార్మిక అమరవీరుల సాక్షిగా తెచ్చుకున్న కార్మిక చట్టాలను నేడు బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందని , దీనివల్ల యావత్ కార్మిక వర్గానికి నష్టం కలిగించే విధంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అప్పనంగా ప్రవేట్ పరం చేస్తూ కార్మిక వర్గాన్ని దెబ్బతీస్తున్నారని ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారన్నారు. కార్మికులకు అండగా సిఐటియు జెండా నిరంతరం పోరాటం చేస్తుందని పోరాడితేనే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని వారన్నారు.రాష్ట్రంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న సంఘటిత అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని 55 సంవత్సరాలు పై బడిన ప్రతి కార్మికుడికి వృద్ధాప్య పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఇల్లు లేని ప్రతి కార్మికుడికి ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 

ఈయొక్క మహాసభలో సిఐటియు కోదాడ పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు మేస్త్రి ఏసోబు సే మేస్త్రి బి శ్రీనివాస్ రాంబాబు వెంకన్న తదితరులు పాల్గొన్నారు అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పి. వెంకట్ రెడ్డి మంద ఉపేందర్ ఉపాధ్యక్షులుగా సిద్దెల రాంబాబు సహాయ కార్యదర్శిగా మంద నాగయ్య కోశాధికారిగా ఆర్ వెంకటేశ్వర్లు. మరియు పది మందితో కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

Related posts

మెడికల్ షాప్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా సుమన్

Harish Hs

11న జరిగే మాదిగల ధర్మ యుద్ధ సమావేశం విజయవంతం చేయండి కళ్ళే పెళ్లి ప్రణయ్ దీప్ మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జులై 3న జరిగే కార్మిక, కర్షక జిల్లా సదస్సును* *జయప్రదం చేయండి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

రాజీవ్ శాంతినగర్ ఎత్తి పోతల పథకం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

TNR NEWS

బిచ్కుంద లో అఖిల భారతీయ సహకార వారోత్సవాలు

TNR NEWS

బాపూజీ గ్రంథాలయం ఎదుట బీఈడీ అభ్యర్థుల నిరసన

TNR NEWS