Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి -స్వేరోస్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ

మోతె : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే – ఇక భారత దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది.సోమవారం సుప్రీంకోర్టులో ఓ కేసు నిమిత్తమై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై ఓ వ్యక్తి అనూహ్యంగా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నావంటూ చెప్పుతో దాడి చేయడానికి పాల్పడడం హేయమైన చర్య అని స్వేరోస్ నెట్వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ మండిపడుతూ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వ్యక్తి తన సనాతన ధర్మం పై జస్టిస్ గవాయ్ పట్ల ఏదైనా ఇబ్బంది కలిగించివుంటే చట్టప్రకారంగా కోర్టులోనే పిటిషన్ వేసి పోరాడలే కానీ ఇలా పిరికివాడిలా చేతకానితనంలా చట్టాలను తుంగలో తొక్కుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై ఈ విధంగా దాడికి పూనుకోవడం సరికాదన్నారు. భారత న్యాయవ్యవస్థకే అవమానం అని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Related posts

అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ పథకాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

యువకుడి అదృశ్యం

TNR NEWS

బీజేపీ పార్టీలో చేరికలతో జోరుమీదున్న నల్లబెల్లి మండలం – *జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ తీర్ధం పూచ్చుకున్న అంజన్ గౌడ్..

Harish Hs

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

TNR NEWS

బిసి విద్యార్థి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడి నియామకం

Harish Hs