మోతె,నవంబర్ 14 (TNR News) : నెహ్రూ జయంతి ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని శ్రీ శాంతినికేతన్ పాఠశాల, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పలు గ్రామాలలో ప్రభుత్వ,ప్రవేట్ స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలు అలంకరించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పాఠశాల ఆవరణలో నిర్వహించిన వివిధ సాంసృతిక కార్యక్రమాలలో విద్యార్థులు పలు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాన్డెంట్ దోసపాటి ఎల్లయ్య, ప్రిన్సిపల్ రాములు,డైరెక్టర్ ఉపేందర్,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.