Tnrnews.in
తెలంగాణ

*మొంథా తుపాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నవంబర్ 3న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి*   తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట:మొంథా తుపాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు,వరదలు ,ఈదురు గాలులు వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాదిఎకరాల్లో వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు నష్టపోయాయని దెబ్బతిన్న పంటలను సర్వే జరిపి రైతాంగానికి నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తూఫాన్ వలన వరి కోత సమయం లో క్రింద పడి మొకాలు లోతు వర్షం నీరు నిల్వ ఉండి మొలకలు వచ్చాయి అని అన్నారు. కొన్ని పంటలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి అన్నారు.నష్ట పరిహారాల నమోదులో స్వంత భూములు కలిగిన సాగు దారుల తోపాటు వాస్తవ సాగు దారులైన కౌలు రైతులను గుర్తించి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో వరి, మిర్చి, పత్తి,కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ముందస్తుగా కౌలు చెల్లించి పంటలు పండించారని, చేతికొచ్చే సమయానికి తుఫాను ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన దెబ్బతిన్న అన్ని పంటలను సర్వే చేసి ఎకరానికి ఆహార పంటలకు రూ. 50,000 వాణిజ్య పంటలకు రూ. 75000, ఉద్యాన పంటలకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండలాలలో పంట ముప్పై మూడు శాతం దెబ్బతింటే మాత్రమే పంటల పరిహారం అందించే నిబంధనలు సడలించి గ్రామం, సర్వే నెంబర్ ఆధారంగా దెబ్బతిన్న పంట నమోదు చేసి పరిహారం అందించాలి అని కోరారు, సిసిఐ కొనుగోలు నిబంధనలు సడలించి రంగు మారిన పత్తిని, గుడ్డుపత్తిని, మరియు వరి ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు

Harish Hs

ప్రజల భద్రతకై పోలీసు తపన. – కుటుంబాల కోసం స్వియరక్షన జాగ్రత్తలు తప్పనిసరి. – ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరాలి. – క్రాసింగ్ ల వద్ద రోడ్డు దాటడంలో స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. -… నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.

TNR NEWS

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలు 

TNR NEWS

ఓదెల మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఆవరణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  పుట్టినరోజు వేడుకలు

TNR NEWS

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

TNR NEWS

తమ్మర సీపీఐ గ్రామశాఖ ఆధ్వర్యంలో సురవరం కు ఘన నివాళులు

TNR NEWS