మోతె : సంక్రాంతి పండుగ సందర్భంగా మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామంలో ఏలూరి పార్వతి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతి గా కూలర్, రెండవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, మూడవ బహుమతిగా ప్రెజర్ కుక్కర్ లను బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు చేతులమీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.మహిళల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు దోహద పడతాయని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూడు నగేష్ నాయక్, సర్వారం గ్రామ పెద్దలు మిక్కిలినేని పురుషోత్తరావు, గ్రామ యువత నాయకులు తదితరులు మహిళలు పాల్గొన్నారు
