జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్
జాతీయ మహిళ కమిషన్ (NCW) 9వ ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు.ఈ
మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు లేదా
65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె ఈ పదవిలో ఉంటారు. ఆమె నియామకం వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.