టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ
విద్యార్థులు కష్టపడి చదివి ప్రతిభ చూపితే తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. ఆదివారం కోదాడ గ్రంథాలయంలో చదువుకుంటూ ఉద్యోగాలు సాధించిన పలువురిని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ తో కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మెరుగైన సమాజం నిర్మాణ కోసం తమ వంతు కృషి చేయడంతో పాటు పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలను చేరదీసి వారికి అండగా నిలవాలి అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు నిరుత్సాహానికి గురికాకుండా వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. గ్రంథాలయంలో విద్యార్థులు చదువుకునేందుకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కష్టపడి చదివి తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ, పిల్లుట్ల శ్రీనివాస్,షేక్ రహీం, లలితా దేవి, మంగమ్మ,రమేష్, నాగమ్మ, పట్నీ, శివాజీ తదితరులు పాల్గొన్నారు…….