Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి కి ఘన సన్మానం మిత్ర బృందం ఆధ్వర్యంలో వంగవీటి కి ఘన సన్మానం

టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

 

తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రుడు వంగవీటి రామారావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని రామారావు తో కలిసి చదువుకున్న 1972-73 మిత్ర బృందం సభ్యులు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో మిత్ర బృందం సభ్యులు రామారావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కొరకు ఒకటే పార్టీలో ఉంటూ ఎంతో కష్టపడి పనిచేశారని వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వంగవీటి రామారావు మాట్లాడుతూ తాను పార్టీకి చేసిన సేవలకు గాను గుర్తించి మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు తనకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ గ్రంధాలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం సభ్యులు అనంత రాములు, వేనేపల్లి సత్యనారాయణ, బొడ్ల మదన్మోహన్ రావు,ఈశ్వర్ రావు, మూర్తి, సత్యనారాయణ, శివరామయ్య, నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు…………

Related posts

సైబర్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

Harish Hs

మాస్టర్ మైండ్స్ పాఠశాలలో గణిత దినోత్సవం 

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

రాంసాని పల్లి చౌరస్తా వద్ద ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌     హర్షం వ్యక్తం చేస్తున్న 5 గ్రామాల ప్రజలు, విద్యార్థులు

TNR NEWS

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..నిందితుల పట్డివేత.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. డీవీ.శ్రీనివాసరావు

TNR NEWS