- సూర్యాపేట జిల్లా స్థాయిలో మీసేవలు అంకిత భావంతో పనిచేయాలని ఇ డి ఎం గఫూర్ అహమ్మద్ అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంవేశలో మాట్లాడుతూ మీసేవ నిర్వాహకులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలన్నారు.మీసేవలో కొత్త సర్వీస్ లు వాటి ప్రాధాన్యత పై అపరెటర్లతో సమీక్ష సమామేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆపరేటర్లు పలు సూచనలు చేశారు.ప్రతి మీసేవ కేంద్రంలో ఆధార్ యు సి యల్ ఏర్పాటు చేయాలని ఇ యెస్ డీ(మీసేవ) కి నివేదిక పంపనున్నమన్నారు. అలాగే సదరం అన్నిరకాల సేవలతో పాటు ధరణి,బ్యాంకింగ్, నాన్ అగ్రకల్టర్ వంటి సేవలను మీసేవలో చేర్చే అంశాన్ని ఉన్నతాధికారులకు పంపుతమన్నారు.ఈ కార్యక్రమంలో మీసేవ ఆపరేటర్లు శ్రీకాంత్,రాజు,వీరబాబు,ప్రవీణ్,గోనె సాగర్,నరేష్, కరుణాకర్ అంజయ్య,సురేష్,మధు, జగదీష్ అనిత,ఉమాదేవి,పద్మావతి తదితరులు పాల్గొన్నారు.