మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ సంక్రాంతి పండుగ అని కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ళ సీతారామయ్యలు అన్నారు. ఆదివారం పట్టణంలోని పెన్షనర్స్ సంఘం కార్యాలయం ఆవరణలో కోదాడ పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి అనంతరం గెలుపొందిన వారికి బహుమతులను అందజేసి మాట్లాడారు. మన భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని ప్రపంచ దేశాలు సైతం చాటి చెబుతున్నాయి అన్నారు. మన పూర్వీకుల నుండి వస్తున్న తెలుగు ప్రజల ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, స్థానిక కౌన్సిలర్ కొల్లా ప్రసన్న లక్ష్మీ, కోటిరెడ్డి, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, చంద్రిక, భారతీ, ఉషారాణి,వీరబాబు,పోటు రంగారావు, భ్రమరాంబ,శోభారాణి, బిక్షం తదితరులు పాల్గొన్నారు……….

previous post