చివ్వెంల మండలంలో బీబీ గూడెం, ఐలాపురం లో ఐకెపి వారు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు జరగాలని కలెక్టర్ తెలిపారు. రైతులు ధాన్యం విక్రయాల్లో నాణ్యత పాటించాలని సూచించారు. కలెక్టర్ కొనుగోలు కేంద్రాలలో రైతుల తెచ్చిన దాన ధాన్యాన్ని ప్రేమ శాతాన్ని కొలిచే యంత్రం ద్వారా స్వయంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరగాలని, కొనుగోలు జరిగిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ వెంటనే చేయాలని , రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు ధాన్యా ఒక్కరు కూడా వివరాలను తాసిల్దార్ సిహెచ్ కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు బిబి గూడెంలో ఏర్పాటుచేసిన దొడ్డు సన్నాల కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్యపడవద్దని తెలిపారు. కొనుగోలు చేసిన పెద్దప ఎగుమతులు దిగుమతులు త్వరగా జరిగేలా చూడాలని మిల్లు యజమానులు హమాలీలను ఎక్కువ శాతం ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సిహెచ్ కృష్ణయ్య ఆర్ఐ శ్రీనివాస్ ఐకెపి సెంటర్ ఇన్చార్జిలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.