కామారెడ్డి జిల్లా మద్నూర్ బాలలు తమ మనసులోని భావాలను ఇతరులతో పంచుకోవాలని,పలువురు వక్తలు , ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మద్నూర్ మండల కేద్రం లో బుధవారం తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం మరియు జూనియర్ కళాశాలలో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవమును నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఉపాధ్యాయులు మాట్లాడారు. బాలలు తమ హక్కులను తెలుసుకోవాలని,విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ప్రిన్సిపాల్ నందాల గంగా కిషోర్ అన్నారు. సంస్కృతభాషా ప్రచార సమితి, నిజామాబాదు, ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రముఖ పద్యకవి, వ్యాఖాత,సంస్కృతోపన్యాసకులు. ప్రధానవక్త బి వెంకట్ మాట్లాడుతూ.. బాలలు విచ్చుకునే పువ్వు లాంటివారని ,నిర్మలంగా ప్రవహించే పావన నదివంటి వారని. ఏమి ఆశించకుండా తీయని ఫలాలను అందించే వృక్షాలలాంటి
వారని, బాలలు వారి హక్కులను,చక్కగా తెలుసుకోవాలని, వారి పసి హృదయాల్లో దాగివున్న భావాలను పెద్దవారికి తెలియజెప్పాలని,వారిలో దాగిన సృజనాత్మకశక్తిని వెలికి తీయాలని,సమాజంపట్ల మంచి భావాలను కలిగి ఉండాలని వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసముతో కలిగి ఉండాలని అన్నారు.
*అలరించిన బాలల పరిరక్షణ ప్రమాణము*
ఈ సందర్భంగా విద్యార్థులు బాలల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడతామని, మొబైల్ కు దూరంగా ఉంటామని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని,మంచి అలవాట్లను అలవరచుకొంటామని, పెద్దవారిని ప్రేమిస్తామని, బాలల పట్ల స్నేహపూర్వకంగా ఉంటామని, భారతీయతను కాపాడుతావని, ప్రపంచంపట్ల శాంతి స్వభావమును కలిగి ఉంటామని, *బాలల హక్కుల పరిరక్షణ ప్రతిజ్ఞను సామూహికంగా చేశారు. అసిస్టెంట్ ప్రిన్సిపాల్ బచ్చు సుమన్ తెలంగాణ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సమన్వయ కార్యదర్శి జాదవ్ గణేశ్, ఉపాధ్యాయులు- జి రాము, యల్ వేణుగోపాల్, కే సంతోష్, సమీనా మహమ్మదీ,533 మంది పాఠశాల,కళాశాల విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.