సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో శుక్రవారం స్వామివారికి మహా అన్నపూజ కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జగ్గయ్య గారి శ్రీనివాస్, లయన్ నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ శివపార్వతుల అనుగ్రహంతో అందరూ బాగుండాలని కార్తీకమాసంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు అన్నపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి దేవదేవుళ్ళ అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు