Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. బయటకు రావాలంటేనే వణుకుతున్న జనం..!!*

 

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గ్రేటర్ సిటీపై చలి పంజా విసురుతున్నది. వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాయంత్రమైందంటే ఇండ్ల తలుపులు, కిటికీలు మూసేయడం, రాత్రి ఫ్యాన్లు ఆపేసే పరిస్థితి నెలకొంది.

తెల్లవారుజామున వివిధ పనులపై బయటకు వెళ్లేవారు స్వెటర్లు, మఫ్లర్లు, చలికోట్లు ధరించి బయటికి వస్తున్నారు. జంటనగరాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.

 

ఈ ఏడాది వింటర్ సీజన్ ప్రారంభంలో నే చలి జనాలను వణికిస్తుంది. రికార్డుస్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత పది రోజులుగా ( నవంబర్ 29 నాటికి) 12 డిగ్రీలు నమోదవుతుంది. గతేడాదితో పోలిస్తే .. ఈ ఏడాది ( 2024) నవంబర్ చివరి వారంలో దాదాపు చలి రెట్టింపయింది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులకు జనాలు తట్టుకోలేకపోతున్నారు, ఉదయం 8 గంటలకు సూర్యుడు మసక మసకగా దర్శనమిస్తున్నాడు. వాకింగ్ చేసే వృద్దులు.. స్కూళ్లకు వెళ్లే చిన్నారులు.. పనులకు.. ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో 3.7 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది.

 

హైదరాబాద్ నగరంలో నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఆరు గంటలు దాటితే ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. నగరంలో చాలా చోట్ల 15 డిగ్రీల సెల్సియస్, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఉదయం పొగ మంచు కురుస్తుండటంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

గత కొన్ని రోజుల నుంచి సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ( November 28th) మల్కాజ్‌గిరిలో 13.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, రాజేంద్రనగర్‌లో 13.7 డిగ్రీల సెల్సియస్, సికింద్రాబాద్‌లో 14.4 డిగ్రీల సెల్సియస్, సరూర్ నగర్‌లో 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

 

ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ( నవంబర్ 30 నుంచి) కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది.దీంతో ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

కేసీఆర్‌ రైతుబంధు.. రేవంత్‌ రాబందు! కాంగ్రెస్‌ అంటే మోసం, దగా, నయవంచన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి..

TNR NEWS

పది లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నా జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి

TNR NEWS

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ఘనంగా ప్రతిభ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS

క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

Harish Hs

కోదాడ నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి,మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

TNR NEWS

తాటాకు చప్పులకు భయపడను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

TNR NEWS