మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, గుర్తూరు మోడల్ పాఠశాలలో జాతీయ మధింపు పరీక్ష ను పరక్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024 పేరుతో రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు తెలిపారు.జాతీయ మదింపు అంచనా పరీక్ష ను దేశ వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన విషయం తెల్సిందే. కాగా పాఠశాల విద్యకు సంబందించి దేశ విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సమర్థ్యలు తెలుసుకొనే ఉద్దేశ్యం తో ఈ అంచనా పరీక్ష ను నిర్వహించడం జరిగింది.ఈ పరీక్ష ను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు క్లస్టర్ వైజ్ గా జిల్లాల వారిగా ప్రభుత్వ, ప్రైవెట్ పాఠశాల లో నిర్వహించడం జరిగింది. తొర్రూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్, వికాస్ హైస్కూల్, ఆర్యబట్ట హైస్కులు, ప్రాథమిక పాఠశాలలో కూడ ఈ పరీక్ష నిర్వహించారని తొర్రూర్ మండల M.E.O మహంకాళి బుచ్చయ్య తెలిపారు.ఈ పరీక్ష నిర్వహణ లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనిత, స్పెషల్ అబ్జర్వర్ సురేష్ లు పాల్గొన్నారు.