తిమ్మాపూర్
ఆపత్కాలంలో బీమా సొమ్ము అండగా ఉంటుందని శ్రీ సాయి పురుషుల పొదుపు సహకార సంఘం నుస్తులాపూర్ సమితి అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ పేర్కొన్నారు. సంఘం సభ్యుడు అలువాల మల్లేశం ఇటీవల చనిపోగా, బుధవారం అతడి కుటుంబ సభ్యులకు రూ. 60వేల బీమా సొమ్మును అందజేశారు. నియమిత పొదుపులు, బోనస్, బోనస్ పై వడ్డీ మొత్తం రూ. 41.654 సభ్యుల నామినికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కొంటు రవీందర్, ఉపాధ్యక్షుడు సయ్యద్ షఫీయోద్దీన్, పాలక వర్గ సభ్యులు, దొంత కళ్యాణ్, వంగాల విజేందర్ రెడ్డి, దేవసాని సంపత్, గుండోజు బాలరాజు, నల్లసుధాకర్ పాల్గొన్నారు.