నెక్కొండ ఈరోజు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు స్థానికత కోల్పోవుటకు కారణమైన, అశాస్త్రీయంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 విడుదలై నేటికీ మూడు సంవత్సరాలు అయినందున వరంగల్ జిల్లా నెక్కోండ మండల ఎంపిడిఓ కార్యాలయంలో బాధిత కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శి సంఘ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపడం జరిగింది .ఇందుకు మద్దతుగా ఎంపిడిఓ నెక్కొండ మండల కార్యాలయ సిబ్బంది మరియు ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ఈనెల 8న చలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో చేపట్టే మహా ధర్నా నిరసన కార్యక్రమం పోస్టర్ను జీవో త్రీ వన్ సెవెన్ జేఏసీ పిలుపుమేరకు విడుదల చేయడం జరిగింది.