Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు

దౌల్తాబాద్: రైతులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తే అదిక లాభాలు పొందవచ్చని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం  రామారం గ్రామ పరిధిలోని ఆయిల్ పామ్ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగు లాభాలు, సాగు మేలుకువల గురించి రైతులకు అవగాహన కల్పించటం జరిగింది. ఆయిల్ ఫామ్ పంటకు నీరు ఎప్పుడు ఇవ్వాలి,సమయానికి ఎరువులు వెయ్యాలని సూచించారు.ఆయిల్ ఫామ్ పంట పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు డ్రిప్ పై 90-95 శాతం ఉంది అన్నారు. మొక్కలు కూడా సబ్సిడీ పై అందుబాటులో ఉన్నాయి.అదే విధంగా ఆయిల్ పామ్ వేసిన రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు మొత్తం రూ.42 వేలు రైతుకు ప్రోత్సాహకంగా ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ కు టన్నుకు రూ.19 వేలు ఉందని సరాసరిగా ఆయిల్ ఫామ్ 10-15 టన్నుల దిగుబడి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రవీణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిసీలకు 42% రిజర్వేషన్ల కొరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి  రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం అన్యాయం జన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు

TNR NEWS

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 

TNR NEWS

ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

Harish Hs

విద్యార్థులు పరీక్షలను జయించడం ఎలా

TNR NEWS

భీముని పాదం జలపాతాన్ని అభివృధి కి సహకరిస్తా జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్

TNR NEWS

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

Harish Hs