తెలంగాణ రాష్ట్ర వర ప్రదాయిని, తెలంగాణ తల్లి , రాజ్యసభ సభ్యురాలు మాజీ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 78 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు. గజ్వేల్ పట్టణ పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా సంబురాలు నిర్వహించారు. తదనంతరం గజ్వేల్ పట్టణంలోని మానసిక వికలాంగుల హాస్టల్ లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీకాంత్ రావు మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమం లో ఎంతో మంది విద్యార్థులు అమరులు అవుతున్నారని గ్రహించి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కి నష్టం వాటిల్లుతుందని, పార్టీ మనుగడ కొల్పుతుంది అని తెలినప్పటికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మహానేత అని కొనియాడారు అలాంటి మహా తల్లి జన్మదినం సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని అన్నారు.