ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇట్టి క్రిస్మస్ పండుగ ముందు కనగల్ మండలం గొల్లపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడుగా, దయామయుడుగా ఆయన క్రైస్తవుల ఆరాధనలను అందుకుంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైవస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగలు పాపుల్ని రక్షించి సన్మార్గంలో నడపడం క్రీస్తు మార్గమని సిస్టర్ పవిత్ర బ్రదర్ చరణ్ కుమార్ తెలిపారు క్రీస్తు చరిత్రను తెలుపుతూ ప్రార్థన చేయించారు చిన్న నాటికలు ద్వారా క్రీస్తు చరిత్ర తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి ,మల్లెపల్లి వీరసేనా రెడ్డి ,చంద్రారెడ్డి ,పోలిశెట్టి సత్తయ్య, మారగాని సైదులు, బైరగాని శ్రీను, బిక్ష మన్యం శ్రీను, ఎండి ఆసిఫ్ , కేకు దాత ఐతగాని శంకరయ్య,గాజుల మారయ్య, శిరీష, క్రైస్తవ సోదరులు పాల్గొని కేకు కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు సెమీ క్రిస్మస్ జరిపిన వారికి ఇందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ క్రైస్తవ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.