అయ్యప్ప స్వాములకు అన్నదానం అభినందనీయమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ల రావెళ్ల కృష్ణారావు ,మాలతి దంపతుల కుమార్తె రావెళ్ళ సాయిశ్రీ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప స్వాములకు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జన్మదిన వేడుకలని వృధా ఖర్చులు చేసే ఈ రోజుల్లో రావెళ్ళ సాయిశ్రీ అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం ఆదర్శనీయమన్నారు. సాయి శ్రీ ఆధ్యాత్మిక సేవా భావాన్ని కొనియాడారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది అన్నారు స్వాముల దీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రావెళ్ల కృష్ణారావు మాలతి, తాళ్లూరి నరసింహారావు సరిత సందీప్ సాయి తదితరులు పాల్గొన్నారు
previous post