చేర్యాల మున్సిపాలిటీ లో మున్సిఫ్ కోర్టు భవనం ప్రారంభానికి సిద్దం చెయ్యాలని జిల్లా జడ్జీ సాయీ రమాదేవి అధికారులను ఆదేశించారు.
గురువారం చేర్యాల మున్సిపాలిటీ లోనీ పాత ఎంపీడిఓ కార్యలయం లో మున్సిఫ్ కోర్టును ఈ నెల 29 న ప్రారంబించడానికి ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరితో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.నేషనల్ హైవే నుండి భవనానికి లోనికి వచ్చే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చెయ్యాలని బయట ఎలాంటి గుంతలూ కనబడకుండా పుడ్చాలని మున్సిపల్ అధికారులను సూచనలు చేశారు.
కోర్టు ఆవరణలో ప్లాంటేషన్ చెయ్యాలని సూచించారు.బయట మెట్లవద్ద చుట్టూ రేలింగ్, లోపల ఫర్నీచర్ వసతి,మైక్ ఆరెంజ్ మెంట్లు,ప్లవర్ డెకరేషన్, ఎమైన చిన్న చిన్న మైనర్ రిపేర్లు లేకుండా పూర్తి చెయ్యాలని సూచించారు.హైకోర్టు పలువురు ప్రముఖులతో ప్రారంభం కావునా బారి బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని ఎసిపి సతీష్ కి తెలిపారు.మున్సిపల్,రెవెన్యూ, పోలిస్,సిద్దిపేట జిల్లా బార్ కౌన్సిల్ అధ్యక్షులుఎస్ జనార్దన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి మంతురి సత్యనారాయణ మరియు అడ్వకేట్స్ సభ్యులందరు సమన్వయం తో ప్రారంభానికి సిద్దం చెయ్యాలని ఆదేశించారు. వీరి వెంట సిద్దిపేట ఆర్డిఓ సదానందం,డిఎల్పిఓ మల్లిఖార్జున్,మున్సిపల్ కమిషనర్ నాగేందర్,ఎంపిడిఓ మహమ్మద్ అలీ,సిఐ శ్రీను ఎసై నీరేశ్ తదితరులు హాజరయ్యారు.