సూర్యాపేట:రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అవమానకరవ్యాఖ్యల బాధాకరమని, తక్షణమే ఆయనను మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అమిత్ షా అహంకారపూరితమైన ,తిరస్కార స్వరంతో అమిత్ షా మాట్లాడడం తన అహంకారాన్ని రుజువు చేసిందన్నారు. భారతదేశ లౌకిక , ప్రగతిశీల రాజ్యాంగ రూపశిల్పి పైన చూపిన అగౌరవాన్ని, అపహాస్యం చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఈ అవమానకరమైన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలనిడిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు కేవలం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన చేసినవి మాత్రమే కాదని,సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న లక్షలాది మంది అణగారిన వ్యక్తులకు జరిగిన అవమానమన్నారు .తక్షణమే అతన్ని బర్తరఫ్ చేయాలన్నారు.
భారత రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడికి వ్యతిరేకంగా భారత ప్రజల నుంచి పెరుగుతున్న ప్రతిఘటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారన్నారు .డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హిందూత్వ శక్తులచే నిరంతరం దాడికి గురవుతున్న భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన నిశ్చయాత్మక చర్యల నిబంధనల పరిరక్షణ కోసం పోరాడటానికి లక్షలాది మందిని ప్రేరేపించారని చెప్పారు. భారత ప్రజలపై మనువాద భావజాలాన్ని రుద్దేందుకు ఈ శక్తులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
అమిత్ షా , బిజెపి పార్టీ వారి ఆలోచనలు కులతత్వంతో ఉన్నాయని, రాజ్యాంగం పట్ల నిజమైన గౌరవం లేదని ,ఇది మరోసారి రుజువయిందన్నారు.
ఎన్నికల సమయంలోనే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్ ,బిజెపి తరచుగా వ్యక్తం చేసే అసహనం, భారతదేశంలో సామాజిక న్యాయం , సమానత్వం కోసం డాక్టర్ అంబేద్కర్ పోరాడి నడిపిన ఉద్యమాలు , ఆదర్శాల పట్ల వారి లోతైన ద్వేషాన్ని వెల్లడిస్తుందన్నారు. మతోన్మాదుల నుండి దేశానికి ప్రమాదం పొంచి ఉందని అమిత్ షా విద్వేషాలకు కారకుడని విమర్శించారు. తక్షణమే అమిత్ షా ను బర్తరఫ్ చేయాలని చేసే వరకుసిపిఎంఉద్యమాలను కొనసాగిస్తుందన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కో లిశెట్టి యాదగిరిరావు, పారేపల్లి శేఖర్ రావు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.