కోదాడ పెరిక హాస్టల్ కు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమని పెరిక సంఘం రాష్ట్ర నాయకులు జుట్టు కొండ సత్యనారాయణ, అంగిరేకుల నాగార్జునలు అన్నారు.
పెరిక కులస్తులంతా ఎల్లప్పుడూ ఇదే స్ఫూర్తితో ఐక్యంగా ఉండి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి అన్నారు. గురువారం హాస్టల్ కు నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన హసనాబాద రాజేష్, గౌరవ అధ్యక్షులు పాయిలి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సుందరి వెంకటేశ్వర్లు, కోశాధికారి గుండు అనురాధ, ఉపాధ్యక్షులు ముత్తినేని కోటేశ్వరరావు, దొంగరి సత్యనారాయణ, కందుల చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి కొనకంచి వెంకటేశ్వర్లు, వనం నాగేశ్వరావు తో పాటు కార్యవర్గం బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారిని అభినందించి శాలువా పూల బొకేతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం హాస్టల్ లో చదువుకునే పేద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి పెరిక హాస్టల్ అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు. అనంతరం జై పెరిక,జై జై పెరిక, పెరిక కులస్తుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో రామినేని శ్రీనివాసరావు, బొలిశెట్టి కృష్ణయ్య, దొంగరి వెంకటేశ్వర్లు, సుంకరి అజయ్ కుమార్, జూకూరి అంజయ్య, పత్తిపాక జనార్ధన్, పుల్లూరి అచ్చయ్య, తోగరు రమేష్, బుడిగం నరేష్, బచ్చు అశోక్, పోకల వెంకటేశ్వర్లు, దొంగరి శ్రీను తదితరులు పాల్గొన్నారు………..