లోకబాంధవుడిగా కీర్తిగాంచి విశ్వ మానవాళికి ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు ఏసుప్రభు అని *కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు* అన్నారు. శుక్రవారం కోదాడ మండలంలోని కూచిపూడి గ్రామంలో నూతన చర్చిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు అన్నారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. ప్రపంచానికి త్యాగం, శాంతి, ప్రేమ సందేశాలను ఆచరణాత్మకంగా అందించిన ఆ ప్రభువు పలుకులు ఆచరణీయం. ఈర్ష్యాద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, ద్రోహచింతన విడనాడాలన్న క్రీస్తు వాక్యము శ్రేయోదాయకం అని ఆయన తెలిపారు. ప్రజలందరికీ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, అంతులేని ఆనందాన్ని, సంపదను ప్రసాదించాలని ఏసుక్రీస్తును ప్రార్ధిస్తున్నాను అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, కూచిపూడి మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు, పాస్టర్ లాజర్ పౌల్, కూచిపూడి తండా మాజీ సర్పంచ్ బాబు రావు, మండల నాయకులు వెంకట నారాయణ , గ్రామ నాయకులు సాయి , మట్టయ్య,కొటయ్య,దేవయ్య , పాస్టర్ వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.