సూర్యాపేట: సహాయ పరికరాల దరఖాస్తు గడువు జూన్ 30 వరకు పొడిగించాలని, నోటిఫికేషన్ సవరించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్ పి ఆర్ డి ) రాష్ట్ర ఉపాధ్యక్షులుజేర్కోని రాజు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఉర ముత్యాలమ్మ దేవాలయoలో జిల్లా అధ్యక్షుడు అర్వపల్లి లింగయ్య అధ్యక్షతన ఎన్ పి ఆర్ డి జిల్లా కమిటీ సమావేశానికి
ముఖ్యాతిదిగా హాజరై ఆయన మాట్లాడుతూ
వికలాంగులు సహాయ పరికరాల పొందెందుకు దరఖాస్తూ గడువు జూన్ 30 వరకు పొడగించాలని, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ సవరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
నోటిఫికేషన్ తేదీ 06.06.2025 నాడు విడుదల చేసినారు. ఇందులో 07.06.2025 నుండి 18.06.2025 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తూ చేసిన వారికి మాత్రమే పరికరాలు మంజూరు చేయాలని నిర్ణయం చేయడం సరైంది కాదు. కేవలం 11 రోజుల వ్యవదిలో దరఖాస్తుకు అవసరం అయిన సర్టిఫికెట్స్ తీసుకోవడం సాధ్యం కాదనే విషయాన్ని అధికారులు గుర్తించాలి. 35 కోట్ల రూపాయలతో పరికరాలు ఇవ్వాలని నిర్ణయం చేసిన అధికారులు దరఖాస్తూ చేసుకోవడానికి కనీసం 30 రోజుల సమయం అయిన ఇవ్వాలి. 11 రోజుల కాలపరిమితి పెట్టడం అంటే లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.ఆన్లైన్లో దరఖాస్తూ చేయాలనే నిబంధన వలన వికలాంగులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది.దరఖాస్తులు ఆన్లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా స్వీకరించేందుకు చర్యలు తీసుకోవాలి. పరికరాల కోసం అనేక నెలల నుండి ఎదురుచూస్తున్న వికలాంగులకు అధికారుల నిర్ణయం వలన నష్టం జరిగే అవకాశం ఉంది.తక్షణమే ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను సవరించాలని, దరఖాస్తు గడువు కనీసం జూన్ 30 వరకు పొడగించాలి.
ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి వీరబోయిన వెంకన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వికలాంగుల పెన్షన్ 6000 వేలు ఇస్తామని మాట తప్పింది. తక్షణమే పించిన్ పెంచాలని, కొత్త ఫింక్షన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ఈ సమావేశం లో జిల్లా మహిళ విభాగం హర్షియా తాబాసుమ్ రుక్సానా, చింత సంతోష, జానయ్య,సంతోష్,కొండయ్య కాంత్రి,సత్యం,రంగయ్య దేవయ్య తదితరుల పాల్గొన్నారు.