యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని కోదాడ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఎండి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ పార్టీ కార్యాలయం పై దాడిని రాష్ట్ర ప్రభుత్వ పిరికిపంద చర్య గా పరిగణిస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సమంజసం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. మరలా పునరావృతమైతే రానున్న రోజుల్లో మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామన్నారు……