నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో అపోలో,మెడికవర్,మెడికల్ అసోసియేషన్,నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో మిర్యాలగూడ మరియు దేవరకొండ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందికి మిర్యాలగూడ పట్టణంలోని ఎం.వి.ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మెగా హెల్త్ క్యాంపును నిర్వహించినారు.ఈ హెల్త్ క్యాంపులో మిర్యాలగూడ డిఎస్పి కె. రాజశేఖర్ రాజు, దేవరకొండ డిఎస్పి జి. గిరీబాబు,మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ కరుణాకర్, మిర్యాలగూడ టూ టౌన్ సిఐ పి.నాగార్జున,మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, హాలియా సిఐ జనార్ధన్,సాగర్ సిఐ బిసన్న,డిండి సిఐ యస్. సురేష్ మరియు 292 పోలీస్
సిబ్బంది పాల్గొన్నారు.ఈ క్యాంపులో పోలీస్ సిబ్బందికి బ్లడ్ టెస్ట్ లు చేసి సంబంధిత మెడిసిన్ ఇవ్వడం జరిగింది.
నిత్యం శాంతి భద్రతలు పరిరక్షించడంలో నిమగ్నమవుతూ… అత్యుత్తమ సేవలందించే పోలీస్ సిబ్బంది వారికి సైతం కూడా జనరిక్ మందులను పంపిణీ చేయడం ఆశ్చర్యకరం. జనరిక్ మందుల స్థానంలో ఎథికల్ బ్రాండెడ్ మందులను పంపిణీ చేస్తే బాగుండేదని కొందరు అభిప్రాయపడటం జరిగింది.