Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

పెద్దొళ్ల దయాకర్‎ను అభినందించిన ఎంపీ

నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవే పరమావధిగా భావించి గ్రామంలో పలు సేవా కార్యక్రమాలను వరుసగా నిర్వహిస్తున్న మండల పరిధిలోని రామన్నగూడ గ్రామానికి చెందిన యువ నాయకులు పెద్దొళ్ల దయాకర్‎ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సమక్షంలో పెద్దొళ్ల దయాకర్ బీజేపీలో చేరారు. తన గ్రామంలోనే ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయనకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దయాకర్ తోపాటు తన గ్రామస్తులు అధిక సంఖ్యలో పార్టీ కండువాలు కప్పుకొని బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ విధానాలు, మోడీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు చెప్పారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని సూచించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యపడతుందని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ చేరికల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాష్, మండలాధ్యక్షుడు పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ మల్గారి విజయలక్ష్మీ రమణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంత్ రెడ్డి, బీజేపీ నాయకులు సామ మాణిక్యరెడ్డి, వైభవ్ రెడ్డి, విఠల్ రెడ్డి, శర్వలింగం, మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి, నరసింహ రెడ్డి, ఆంజనేయులు, కృష్ణగౌడ్, కుమార్ గౌడ్, బాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పత్తి సత్యనారాయణ మల్లారెడ్డి, అల్లాడ శ్రీనివాస్ రెడ్డి, అభిలాష్, మధుకర్ రెడ్డి, జయశంకర్, చంద్రశేఖర్ రెడ్డి, జైసింహా రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి….

TNR NEWS

వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి

Harish Hs

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

Harish Hs

కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే 

Harish Hs

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 

TNR NEWS

సరిపడా యూరియా రైతులకు పంపిణీ చేయాలి    సీపీఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి

TNR NEWS